సంతనూతలపాడు: స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు మండల స్థాయి అధికారులతో కలిసి సంతనూతలపాడులో శనివారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీడీవో మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల అపరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు ప్రభలుతాయన్నారు. క్లీన్ సంతనూతలపాడుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు.