పోలీస్ ట్రైనింగ్ కళాశాలను తనిఖీ చేసి పలు సూచనలను చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Oct 18, 2025
208 మంది పోలీసు కానిస్టేబుల్ లకు శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఒంగోలు కొత్త మామడిపాలెంలోని పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ , ఇతర పోలీసు అధికారులతో కలిసి ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, బ్యారక్లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. వంట గదిలో అపరిశుభ్రత ఉండటం గుర్తించి వెంటనే మార్పులు చేయాలన్నారు. డైనింగ్ హాల్ లో తలుపులు, పెయింటింగ్ తో బాటు, పైకప్పు నుండి కారుతున్న వర్షపు నీరును గుర్తించి వెంటనే మర్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.