కుప్పం: జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో చోరీ
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. స్థానికంగా ఉంటున్న సికందర్ బెంగళూరులో బంధువుల వివాహానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఆదివారం తిరిగి ఇంటికి వచ్చేలోపు దొంగలు అందిన కాడికి దోచేశారు. ఇంటి తలుపులతో పాటు బీరువాలను పగలగొట్టి అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లినట్టు బాధితుడు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.