మంత్రాలయం: వైసీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఉద్యమంతో దద్దరిల్లిన మంత్రాలయం
మంత్రాలయం:వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఉద్యమం తో మంత్రాలయం దద్దరిల్లింది. ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం అబ్బౌడీ హోటల్, రాఘవేంద్ర కూడలి నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ 4 మండలాల వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.