సంగారెడ్డి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మంజూరు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోల్లపల్లి జయరాజు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. పార్లమెంట్లో రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపినప్పటికీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు.