కనిగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, ఎంఈఓ నారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, స్వయంగా భోజనాన్ని రుచి చూసి వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే విధంగా ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యతగా విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలో వందరోజుల ప్రణాళికను పరిశీలించి, పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే విధంగా కృషి చేయాలని పాఠశాల ఎస్ఓ హసీనాను ఎంఈఓ నారాయణరెడ్డి ఆదేశించారు.