ప్రకాశం జిల్లా సింగరాయకొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ సోమయ్య గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా అందజేశారు. పాకాల గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో గతంలో ప్రమాద బీమా చేయించుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులకు రూ.20 లక్షలు విలువచేసే చెక్కును మేనేజర్ సోమయ్య గురువారం అందజేశారు. ప్రమాద బీమా ఉండడం వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలు గ్రహించాలని మేనేజర్ సోమయ్య విజ్ఞప్తి చేశారు.