కర్నూలు: ప్రభుత్వ విద్యను వైద్యాన్ని ప్రైవేటుపరం చేసి కూటమి ప్రభుత్వం దోచుకునేందుకు ప్రయత్నిస్తుంది:వైకాపా నేత ఎస్వీ మోహన్ రెడ్డి
ప్రభుత్వ వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఎస్ వి విజయ మనోహర్ అన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్నూల్ నగరంలోని 16 వార్డులో మెడికల్ కళాశాలలో ప్రైవేటు ఫోరం చేయడానికి వ్యతిరేకిస్తూ ఇంటింటికి తిరుగుతూ సంతకాల సేకరణ చేపట్టారు.