ఉదయగిరి: తక్కెళ్లపాడు లో పది రోజులుగా విద్యుత్ సరఫరా లేదని వింజమూరు సబ్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన
వింజమూరు మండలం ఊటుకూరు తక్కెళ్లపాడులో పది రోజులుగా విద్యుత్తు సరఫరా లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. వింజమూరు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పలుమార్లు అధికారులకు చెప్పినా మరమ్మతులు చేసేందుకు కొన్ని వస్తువులు లేవని, అవి తెచ్చుకుంటే చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా కరెంట్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నారు.