శామీర్పేట: ఉప్పల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్లే మార్గంలో భారీగా ఆదివారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాల వల్ల నల్లచెరువు కట్ట ప్రాంతంలో వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు నీటిని క్లియర్ చేస్తూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలను చేపట్టారు. వర్షాలు నేపథ్యంలో వాహనదారులు అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని సూచించారు.