కుప్పం: కుప్పం అభివృద్ధికి సీఎం చర్యలు : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కుప్పం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలంలోని మాటార్లపల్లెలో రూ.50 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంగళవారం వారు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు.