గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలను అమలు చేసినందుకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన టిడిపి కార్యకర్తలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ టిడిపి మహిళా కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మహిళలకు తల్లికి వందనం దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు మహిళా కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.