అనంతపురం జిల్లా పామిడి అర్బన్ పోలీసు స్టేషన్ నూతన సీఐగా ఎస్డీ.శివశంకర్ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పామిడి సీఐగా ఉన్న యుగంధర్ కర్నూలు జిల్లాకు బదిలీ పై వెళ్లడంతో పామిడి సర్కిల్ రెండు నెలల పాటు ఇంచార్జ్ లతో కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పామిడి సీఐగా శివశంకర్ నాయక్ ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ రవి ప్రసాద్, ఇబ్బంది సీఐ కి స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.