అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లోని దుర్గా మందిర్ కి భక్తుల తాకిడి
ఆదిలాబాద్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక దుర్గానగర్ లోని నవశక్తి దుర్గా పీఠంలో భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రులలో కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.