ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 20వ తేదీన జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
Ongole Urban, Prakasam | Oct 19, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 20వ తేదీన సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దయినట్లుగా కలెక్టర్ రాజాబాబు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దూరప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై వచ్చి అర్జీలు ఇచ్చేవారు రేపు ఒంగోలుకు రాకుండా ఉండాలని అధికారులు ప్రకటనలో వెల్లడించారు. తదుపరి వచ్చే సోమవారం ఈ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.