తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన సోమవారం రాత్రి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై శ్రీ పద్మావతమ్మ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభిమానిస్తాయి పరమాత్ముడైన హరి పట్టపురాని అలిమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలి దోషాలు తొలుగుతాయని విశ్వాసం.