రాయదుర్గం: నగదు పోగొట్టుకొన్న గోపులాపురం గ్రామానికి చెందిన మహిళలకు రికవరీ చేసి నగదు అప్పగించిన పోలీసులు
కనేకల్ క్రాస్ లో బస్సు ఎక్కుతుండగా పోగొట్టుకున్న 22 వేల నగదు 3 ఆధార్ కార్డులు ఒక యూనియన్ బ్యాంక్ పాస్ బుక్, ఒక ఏటీఎం లను కణేకల్ పోలీసులు సిసి కెమెరాల ద్వారా ఛేదించి బాధితులకు అప్పగించినట్లు సిఐ వెంకటరమణ వెల్లడించారు. ఈనెల 17 న గోపులాపురానికి చెందిన హరిజన గీతమ్మ నగదు పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించిందన్నారు. దర్యాప్తు చేసి మరో మహిళకు దైరికిన ఆ నగదును కణేకల్లు పోలీసులు రికవరీ చేసి అప్పగించామన్నారు.