మార్కాపురం: ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. మరుగుదొడ్లను, మంచినీటి సదుపాయాన్ని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఏ విధంగా ఉందని స్థానిక ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా బస్సు నడిపి మహిళ ప్రయాణికులను ఉత్సాహపరిచారు. డిఎం నరసింహులు నాయకులు పాల్గొన్నారు.