పుల్కల్: పుల్కల్ పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ పోలీస్ స్టేషన్ను గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా పుల్కల్ పోలీసు గౌరవ వందనం స్వీకరించి, డిఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల మెంటేనేన్స్ ను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేస్తూ.. కిట్ ఆర్టికల్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న కేసులో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.