నారాయణపేట్: జాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా జరిగిన అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
నారాయణపేట మండలంలోని జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలం ఆకారంలో కూర్చొని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది ఉన్నారు.