జైనూర్: జైనూర్ బాధితురాలిని గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర మంత్రి సీతక్క
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ బాధితురాలిని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సీతక్క ,ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.డాక్టర్లతో మాట్లాడి మహిళ ఆరోగ్య పరిస్థితిపై అరా తిశారు.మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచనలు చేశారు.