కుప్పం: జిఎస్టి తగ్గింపుతో కుప్పంలో సంబరాలు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం పట్ల కుప్పంలో కూటమి నేతలు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. కుప్పంలోని ఎన్టీఆర్ సర్కిల్లో బీజేపీ కుప్పం ఇన్ఛార్జ్ తులసీనాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం ఫ్లెక్సీలకు కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. భారతమాతకి జై నినాదాలతో హోరెత్తించారు.