సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13 నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సీఎస్ కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ వాతావరణానికి తగిన విధంగా హైదరాబాద్ నగరం సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని సూచించారు