అనంతపురం జిల్లా ముక్కల కుంట గ్రామం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా వివాహితకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ముక్కలకుంట గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో లక్ష్మీ అనే వివాహితకు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందన్నారు.