అలరించిన పౌరాణిక పద్య ఏకపాత్రాభినయం పోటీలు
పార్వతీపురం లైన్స్ కల్యాణ మండపంలో ఆదివారం ఉత్తరాంధ్ర స్థాయిలో పౌరాణిక పద్య ఏకపాత్రాభినయ పోటీలు జరిగాయి. శ్రీ వాణి ఆర్ట్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం డాక్టర్ పిజే నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సత్య హరిచంద్ర, నారదుడు, విశ్వామిత్ర, చంద్రమతి, అర్జునుడు తదితర పాత్రలతో పోటీపడ్డారు. ఏకపాత్రాభినయ ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డా. యాళ్ళ వివేక్ తదితరులు పాల్గొన్నారు.