మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. నెల్లూరులోని ముత్తుకూరు బస్టాండ్ ఆత్మకూరు బస్టాండ్ వంటి ప్రాంతాలలో, అలాగే జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. హెల్మెట్ ధరించకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు