శ్రీకాకుళం: నరసన్నపేట మండలం కంబకాయ సచివాలయ పరిధిలో ఉన్న పశువైద్య ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది.
నరసన్నపేట మండలం కంబకాయ సచివాలయ పరిధిలో ఉన్న పశువైద్య ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. పదేళ్లుగా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని సిబ్బంది తెలిపారు. కేంద్రానికి ఎదురుగా ఉన్న రహదారి ఎత్తుగా ఉండడంతో ఇటీవల పడిన వర్షాలకు కేంద్రంలోకి నీరు చేరిపోయింది. విధులు నిర్వహించేందుకు బురద నీటిలో వెళ్లక తప్పడం లేదు. మరమ్మతులు చేపట్టి రాకపోకలు సక్రమంగా జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.