ఎన్ తిమ్మాపురం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడి దంచర్లకు చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 1, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుంతకల్లు మండలం ఎన్ తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గుంతకల్లు మండలంలోని దంచర్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి శనివారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.