మెదక్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడమే లక్ష్యం : మై భారత్ జిల్లా యూత్ అధికారి రంజిత్ రెడ్డి
Medak, Medak | Sep 20, 2025 కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడమే లక్ష్యం : మై భారత్ జిల్లా యూత్ అధికారి రంజిత్ రెడ్డి వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ కార్యక్రమంలో యువత పాల్గొనాలని మై భారత్ జిల్లా యూత్ అధికారి రంజిత్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మీడియతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహిస్తుందని, యువత ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.