మంత్రాలయం: బెంగళూరులో తప్పిపోయిన పిల్లలనువారి కుటుంబాల చెంతకు చేర్చిన మంత్రాలయం ఎస్సై
మంత్రాలయం:బెంగళూరులో తప్పిపోయిన పిల్లలను మంత్రాలయం ఎస్సై వారి కుటుంబాల చెంతకు చేర్చారు. శుక్రవారం ఎస్సై శివాంజల్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన విశాల్, రంజిత్, తనీష్ అనే విద్యార్థులు ఇంట్లో చెప్పకుండా బెంగుళూరు నుంచి మంత్రాలయం బస్సు ఎక్కి వచ్చారు. రాఘవేంద్ర కూడలిలో వారు ఏడుస్తూ ఉండగా.. హోంగార్డు నాగేశ్వర్ రెడ్డి గుర్తించి ఎస్సైకి అప్పగించారు. ఆయన విచారించి కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.