ఈనెల 28న తలపెట్టిన ప్రజా ఉద్యమం ర్యాలీని జయప్రదం చేయాలని వైసీపీ యాడికి మండల కన్వీనర్ సంజీవ రాయుడు పిలుపునిచ్చారు. యాడికి లో శనివారం వైసీపీ నాయకులు ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే కుట్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ర్యాలీ తల పెట్టామన్నారు. వైసీపీ శ్రేణులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.