ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. అంతేకాకుండా పోలీసులు స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో పాటు మందు బాబులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం చట్టరీత్యా నేరమని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు.