యాడికి మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి దీపావళి సంబరాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్లలో గిళ్లలో దీపాలు వెలిగించారు. రకరకాల బాణాసంచ కాల్చారు. ఎక్కడ చూసినా టపాసులు మోత వినిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తూ దీపావళి సంబరాలను నిర్వహించారు. ఎక్కడ చూసినా సందడి,కోలాహలమే కనిపించింది. మొత్తం పై దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.