పర్యావరణాన్ని కాపాడుతూ టూరిస్ట్ హబ్ గా నర్సాపూర్ను అభివృద్ధి చేయాలని ఏకో పార్క్ ప్రారంభోత్సవంలో ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్ అటవీ ప్రాంతం కలుపుకొని ఏర్పాటుచేసిన ఏకోపార్క్ ను మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే సునీత రెడ్డి తో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ చెరువును కలుషితం చేయకుండా టూరిస్ట్ ప్లేస్ గా నర్సాపూర్ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. తమ సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఆఫీసర్లు పాల్గొన్నారు.