రాయదుర్గం: నియోజక సర్వతోముఖాభివృద్ధికి కృషి : పట్టణంలో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
వెనుకబడ్డ రాయదుర్గం ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి నిర్విరామoగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలియజేశారు. రాయదుర్గం పట్టణంలోని 11వ వార్డులో కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం మద్యాహ్నం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని విపరీతమైన ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయాల అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మురడి, నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయాలతో పాటు పశుపతి నాథ స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.