ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో సాగర్ కవచం కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బందికి ఒంగోలు డివిజన్ డిఎస్పి శ్రీనివాసరావు సూచనలు సలహాలు ఇచ్చారు. సముద్ర తీరంలో పర్యటకులు సరదాగా గడిపేందుకు వస్తుంటారని ఈ నేపథ్యంలో సముద్రంలో ఈత కొడుతున్న సమయంలో వారికి ఎటువంటి ఆపద తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. ముఖ్యంగా వాతావరణ శాఖ తెలిపిన పాటిస్తూ మెరైన్ పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.