జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు వాంకిడి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించి యూరియా పంపిణీ పై ఆరాతీశారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. మొదటి దఫాలో అవసరమైన యూరియా తీసుకెళ్లాలని రైతులు సూచించారు. ఎకరాలకు రెండు బస్తాల చొప్పున యూరియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే తహసీల్దార్ కు ఫిర్యాదు చేస్తే. వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.