సావిత్రిబాయి ఫూలే 195వ జయంతిని పురస్కరించుకొని బన్సీలాల్పేటలో కాంగ్రెస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. సనత్నగర్ ఇంచార్జ్ నీలిమ ఆదేశాల మేరకు కవాడిగూడ, మోండా మార్కెట్, రాంగోపాల్పేట ప్రాంతాల్లోని పాఠశాలల ప్రిన్సిపళ్లు, ఉపాధ్యా యురాళ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలి సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది.