ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శుక్రవారం ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని స్థానిక ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 5కే రన్ నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కార్యక్రమాన్ని నిర్వహించామని కార్యక్రమం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించామన్నారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.