కంబాలపల్లే గ్రామం వద్ద నేషనల్ హైవే 340C మీద ఎద్దుల బండిని ఢీకొన్న బైకు, బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు
పాములపాడు మండలం కంబాలపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవే 340 సి రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, ముందుగా వెళుతున్న ఎద్దుల బండిని వెనక వస్తున్నా బైక్ వేగంగా ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న బి తాండ్రపాడు గ్రామానికి చెందిన జమీర్ భాష అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే అతనిని స్థానిక ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు, అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులకు సూచనలు మేరకు కర్నూల్ ఆసుపత్రికి తరలించారు, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,