అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అర్జున్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ రామాంజనేయులు తెలిపారు.