కర్నూలు: నారాయణపురం గ్రామాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
నారాయణపురం గ్రామాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్లోని మీడియా పాయింట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆదోనికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనాపురాన్ని, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివనం మండలంలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. గ్రామ ప్రజల అవసరాలు, రోజువారీ పనులు ఆదోనికి సంబంధించినవేనని, మండల మార్పు జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా అధికారులు వెంటనే స్పందించి, ధనాపురం గ్రామాన్ని ఆదోని మండలానికి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.