మార్కాపురం: అమర జవాన్ల స్థూపానికి ఘన నివాళులర్పించిన అఖిల్ భారతీయ పూర్వ సైనిక సేవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి అఖిల్ భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కల్నల్ పాలేటి రాంబాబు బృందం వచ్చారు. ముందుగా తర్లపాడు రోడ్డులోని అమర జవాన్ల స్తూపానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మాజీ సైనికుల జాతీయ సమైక్యత సామరస్యం మరియు అంతర్గత భద్రతకు దోహదపడేలా వారిని ప్రేరేపించడం జరుగుతుందన్నారు. విద్య ఆరోగ్య సంరక్షణ మరియు గ్రామీణ అభివృద్ధి వంటి రంగాలలో ప్రోత్సహిస్తామన్నారు. పదవి విరమణ చేసిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమాజంలో యువతను మంచి విలువలు గల భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతామన్నారు.