అదిలాబాద్ అర్బన్: రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యవంశీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. పార్టీ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా గౌతమ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా మోహిన్, మహిళా అధ్యక్షురాలిగా వైశాలి, కోశాధికారిగా సంజయ్, జనరల్ సెక్రెటరీగా అరుణ్‌ను ఎన్నుకున్నారు.