ఓడీ చెరువులో జ్యోతులు, బోనాల ఉత్సవాలు
మహాలయ పౌర్ణమి సందర్భంగా అదివారం సాయంత్రం జ్యోతుల బోనాలు నిర్వహించారు. ఓడిచెరువు మండల పరిధిలోని ఆకుతోటపల్లి, గౌనిపల్లిలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆయా కాలనీల్లో మహిళలు ప్రతి ఇంటి నుంచి జ్యోతిని ఎత్తుకుని గ్రామదేవత గంగమ్మను ఆలయం వరకు ప్రత్యేక వాయిద్యాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. గంగమ్మను భక్తిశ్రద్ధలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు.