అనంతపురం జిల్లా పామిడి సమీపాన గురువారం రాత్రి 8 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని గుంతకల్ మండలం కదిరిపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలవ్వడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం నుండి కదిరిపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పామిడి సమీపంలో ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.