కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి
కోరుట్ల నియోజకవర్గం లో బతుకమ్మ సంబరాలు రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు కోరుట్ల నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు తమ ఇంటి వాకిళ్ళ ముందు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి అలంకరించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అంతా కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. గౌరమ్మను పూలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. తొమ్మిది రోజులపాటు సాగే ఈ వేడుకల్లో ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను కొలుస్తారు. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.