తనపై టీడీపీ నాయకుడు దాడి చేశాడని జర్నలిస్టు ఆంజనేయులు వాపోయారు. బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు సొసైటీలో, యూరియా రైతులకు అందడం లేదని, యూరియా పంపిణీపై అవకతవకలు జరిగాయని శుక్రవారం మీడియాలో ప్రసారమైంది. జిల్లా అధికారులు తనిఖీకి వస్తున్నారని శనివారం సొపైటీ వద్దకు పిలిపించి మండల కన్వీనర్ ముమ్మడి కృష్ణారెడ్డి దాడి చేసినట్లు తెలిపారు. న్యాయం చేయాలని పోలీసులను కోరితే వారు కేసు నమోదు చేయలేదని, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.