పలాస: మందస మండలం కొర్రాయి గేట్ సమీపంలో అర్ధరాత్రి దాటిన వేళ మద్యం మత్తులో యువకుల కొట్లాట, తీవ్రంగా గాయపడ్డ రోహిత్ అనే యువకుడు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొర్రాయి గేటు సమీపంలో అర్ధరాత్రి దాటిన వేళ మద్యం మత్తులో కొందరు యువకులు కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో కాశీబుగ్గ హరిజన వీధికి చెందిన శివ దాడి చేయడంతో హారిపురం గ్రామానికి చెందిన రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు రోహిత్ ను చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మందస పోలీసులు సోమవారం ఉదయం 10 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...