ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్ లో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం ఉదయం బంజారా కాలనీలో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం అందించాలని అలాగే వారికి భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమకు తెలియజేయాలని ఎమ్మెల్యే అన్నారు.